ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలలో కొత్త కరోనా స్ట్రైన్ గుర్తింపు

-

తెలంగాణలో శరవేగంగా కొత్త రకం కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఈ కొత్త వేరియంట్ కి శాస్త్రవేత్తలు ఎన్440కే రకంగా నామకరణం చేశారు. కొత్త రకానికి కోవిడ్-19 యాంటీబాడీస్‌ నుంచి తప్పించుకునే లక్షణం ఉందని గుర్తించారు. ఏపీ నుంచి విశ్లేషించిన 272 కోవిడ్-19 శాంపిళ్ల జీనోమ్ విశ్లేషణలో 34% శాంపిళ్లలో ఎన్440కే రకం గుర్తించారు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎన్440కే ఉన్నట్టు గుర్తించారు వైద్యారోగ్య శాఖ అధికారులు.

నోయిడాలో ఒక కోవిడ్ రీ-ఇన్ఫెక్షన్ కేసు గుర్తించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో 6,370 జీనోమ్ విశ్లేషణ జరపగా, 2% లో ఎన్440కే రకం మ్యుటేషన్ గుర్తించారు. జులై-ఆగస్టు నెలల్లో ఆసియాలో ఎన్440కే రకం కరోనా వైరస్ ఆవిర్భవించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 5% జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version