శోభనం రోజు గొడవ..వరుడు చేసిన పనికి సూసైడ్ అటెంప్ట్ !

-

పెళ్లి పారాణి కూడా ఆరక ముందే ఓ నవ వధువు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే  తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం, బొట్టు చెరువు గ్రామనికి చెందిన‌ స్వామి ప్రగతి నగర్ లో నివసిస్తున్నారు. స్వామి తన పెద్ద కుమార్తె సౌజన్యకు, ఏపీలోని తమ స్వగ్రామంలో గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్న వేంకటేశ్వర రావుకి ఇచ్చి ఈ నెల 6వ తేదీన వివాహం జరిపించారు.

suicidethinkphotos

వివాహం అనంతరం శోభనం కోసం 9వ తేదీన ఏర్పాట్లు చేశారు. కానీ 10వ తేదీ ఉదయం, సౌజన్య భర్త వేంకటేశ్వర రావు, తమకు శోభనం జరగలేదని, ఆమె నిరకారించింది అని అలా ఎందుకు నిరాకరించిందో కారణం తెలుసుకోవాలని సౌజన్య తల్లిదండ్రులను కోరాడు. తమ మధ్య ఉండాల్సిన విషయం తల్లి తండ్రుల ముందు చెప్పడంతో మనస్తాపానికి గురైన సౌజన్య, గదిలోకి వెళ్ళి ఫ్యానుకు ఉరివేసుకుంది. సౌజన్య తలుపు తీయకపోవటంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్ళిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. సౌజన్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని లీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version