బ్రేకింగ్‌: బిత్తిరి స‌త్తికి క‌రోనా పాజిటివ్‌..!

-

ప్ర‌ముఖ యాంక‌ర్‌, న‌టుడు బిత్తిరి సత్తికి క‌రోనా సోకింది. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుండ‌డంతో స‌త్తి టెస్టు చేయించుకున్నాడు. అయితే రిపోర్టు ఇంకా రాన‌ప్ప‌టికీ ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో క‌చ్చితంగా పాజిటివ్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. కాగా స‌త్తి ఇటీవ‌లే టీవీ9 ఇస్మార్ట్ న్యూస్ నుంచి త‌ప్పుకుని సాక్షి చాన‌ల్‌కు వెళ్లాడు. అందులో నిత్యం గ‌రం గ‌రం వార్త‌ల షోలో కనిపిస్తున్నాడు.

కాగా స‌త్తితోపాటు గ‌రం గ‌రం వార్త‌ల షో టీం మొత్తానికి క‌రోనా సోకిన‌ట్లు తెలుస్తోంది. ఇక స‌త్తి బుధ‌వారం ప్ర‌సార‌మైన గ‌రం గ‌రం వార్తల షోలో ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉండి వీడియో పంపాడు. అయితే సాయంత్రం వ‌ర‌కు టెస్టు రిజ‌ల్ట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయినా ల‌క్ష‌ణాలు మాత్రం క‌చ్చితంగా క‌రోనావే ఉండ‌డంతో.. స‌త్తికి క‌రోనా పాజిటివ్ వ‌స్తుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

అయితే కేవ‌లం స‌త్తి మాత్ర‌మే కాదు.. ఇటీవ‌లి కాలంలో అనేక మంది సినీ, టీవీ ప్ర‌ముఖుల‌కు క‌రోనా సోకింది. ఈ క్ర‌మంలో చాలా మంది ఇంట్లోనే చికిత్స తీసుకుని కోలుకున్నారు. తాజాగా సినీ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి కూడా కరోనా నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే స‌త్తికి క‌రోనా సోక‌డంతో నిత్యం ఆయ‌న ఇంట్లో నుంచే వీడియోలు చేసి పంపిస్తాడ‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version