ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను నిజంగా 2020 సంవత్సరం అతలాకుతలం చేసింది. ఈ ఏడాదిలో కరోనాతోపాటు ప్రకృతి విపత్తులు కూడా బాగానే సంభవించాయి. అడవుల్లో అగ్ని ప్రమాదాలు, తుపాన్లు, వరదలు.. అనేకం వచ్చాయి. దీంతో జనాలు ఈ ఏడాదిలో విపరీతంగా నష్టపోయారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టం భారీగా సంభవించింది. దీంతో 2021 ఎప్పుడు వస్తుందా, కనీసం ఆ ఏడాది అయినా మనకు బాగుంటుందా ? అని జనాలు ఎదురు చూస్తున్నారు. అయితే నిజానికి 2021 కూడా పెద్దగా ఏమీ మనకు బాగుండదు. అవును.. ఈ విషయాన్ని నికోలాస్ ఔజులా అనే సైకాలజిస్టు చెప్పారు. ఈయన 2020లో కరోనా వస్తుందని గతంలోనే చెప్పారు. అది నిజమైంది. ఇక 2021లో ఏమేం సంఘటనలు చోటు చేసుకుంటాయో ఈయన ముందుగానే ఊహించి చెప్పారు. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. వచ్చే ఏడాది ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆందోళనలు ఎక్కువవుతాయన్నారు. ఆ పరిస్థి మరో 2, 3 ఏళ్లు కొనసాగుతుందన్నారు.
2. వచ్చే ఏడాదిలో పిగ్ ఫ్లూ వస్తుందని, దాంతో ప్రపంచం మరోసారి ఇబ్బందులు పడుతుందన్నారు.
3. వచ్చే ఏడాదిలో ఒక పెద్ద రాజకీయ నాయకుడు హత్యకు గురవుతాడని తెలిపారు. అయితే అతని పేరును చెప్పలేదు.
4. దక్షిణ యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో రాజకీయాల్లో భారీ మార్పులు ఉంటాయన్నారు. అలాగే వరల్డ్ సమ్మిట్‌ను ఒక పెద్ద సెక్స్ స్కాండల్ కుదిపేస్తుందని తెలిపారు.
5. వచ్చే ఏడాదిలో వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని, అగ్ని పర్వతాలు బద్దలవుతాయని ఔజులా అంచనా వేశారు.
6. నటాలీ పోర్ట్‌మన్, కిమ్ కార్దాషియన్, టామ్ క్రూయిజ్ వంటి సెలబ్రిటీలకు ముప్పు ఉంటుందని, వారు చనిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. టామ్ క్రూయిజ్‌కు గుండె సమస్య వస్తుందని తెలిపారు.
కాగా ఔజులా గతంలోనూ పలు అంచనాలు వేశారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతాడని, ప్రపంచ వ్యాప్తంగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం జరుగుతుందని అన్నారు. అలాగే జరిగింది. దీంతో ఔజులా అంచనాలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే పైన తెలిపినవి వచ్చే ఏడాదిలో చోటు చేసుకుంటాయా, లేదా అన్నది తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.