మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది నిహారిక కొణిదెల. మెగా డాటర్ గా మరింత పాపులారిటీని సంపాదించుకున్న ఈమె కొణిదెల ఫ్యామిలీకు ఫేవరెట్ డాటర్ అని చెప్పడంలో సందేహం లేదు. చిరంజీవిని మొదలుకొని పవన్ కళ్యాణ్ వరకు ప్రతి ఒక్కరికి నిహారిక అంటే చాలా ఇష్టం. అందుకే నిహారికను చాలా గారాబంగా చూసుకుంటూ ఉంటారు. నిహారిక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత వ్యాఖ్యాతగా తన కెరియర్ ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది. అయితే హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగించలేకపోవడంతో.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వివాహం అనంతరం నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ఇటీవలే ఒక వెబ్ సిరీస్ కి నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ అందుకుంది.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి ఈమె పై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు భర్తకు దూరంగా ఉంటుందని.. కుటుంబ సభ్యులకు తెలియకుండా తాను ఒక ఇంట్లో.. తన భర్త వేరొక ఇంట్లో ఉంటున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు ప్రస్తుతం విహారయాత్రలకు వెళ్లి ట్రిప్ జాలీగా ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో తన భర్త లేకపోవడం చూసి ప్రతి ఒక్కరు కూడా ఇదే నిజం అంటూ నమ్ముతున్నారు.ఇటీవల టర్కీ కి వెళ్లిన నిహారిక అక్కడ పక్షి లాగా చాలా స్వతంత్రంగా తన స్నేహితులతో ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.
తన స్నేహితులతో ట్రిప్ ఎంజాయ్ చేయడం బాగున్నప్పటికీ వివాహం అనంతరం అందులోను కొత్తగా వివాహం జరిగింది . తన భర్త కూడా లేకుండా తాను ఒక్కతే వెళ్లడంతో ఈమెపై రకరకాల కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో మరింత పాపులారిటీ అవ్వడమే కాకుండా ఈ ఫోటోలతో మరింత కాంట్రవర్సీలకు కూడా గురవుతోంది నిహారిక. ఈ ఫోటోలను చూసిన తర్వాత చైతన్య లేడే? ఆయనెక్కడ ? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు..మరి ఈ కామెంట్లకు ఆమె ఎలా స్పందిస్తుందో తెలియాల్సి వుంది.