ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటన కామారెడ్డి జిల్లాలో మూడు రోజులపాటు కొనసాగింది. జహీరాబాద్ పార్లమెంట్ పరిధి లో ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి. తెలంగాణలో కేంద్ర మంత్రి పర్యటన హాట్ హాట్ గా సాగింది. తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ గా నిర్మలా టూర్ కొనసాగింది.
కామారెడ్డి కి వచ్చిన మొదటి రోజే ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు కేంద్రమంత్రిి. నిన్న కలెక్టర్ కి క్లాస్ పీకిన మంత్రి… పేదలకు ఇచ్చే బియ్యం వాటాలో కేంద్ర, రాష్ట్ర వాటా ఎంత అని ప్రశ్నించారు.కేంద్ర మంత్రిపై కౌంటర్ ఎటాక్ కి దిగారు మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం. ఈ రోజు కూడా రైతు సమ్మేళనంలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు కేంద్ర మంత్రి.
తెలంగాణలో 100 మంది లో ఐదుగురికి మాత్రమే రుణాలు మాఫీ చేస్తున్నారని చెప్పారు నిర్మల. నేను ప్రశ్నిస్తే నన్ను తిడుతున్నారని చెప్పారు. వరి వేస్తే ఉరే అని చెప్పి..రైతులను భయపెడుతున్నారన్నారు కేంద్రమంత్రి. తాజాగా నేడు సాయంత్రం నిర్వహించే ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.