NMACC లాంచ్​ ఈవెంట్​లో నీతా అంబానీ క్లాసికల్ డ్యాన్స్.. వీడియో వైరల్

-

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌(NMACC) ప్రారంభ వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కల్చరల్‌ సెంటర్‌ ఆరంభోత్సవాలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. మొదటిరోజు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ముకేశ్‌ అంబానీ కుటుంబసభ్యులు, బాలీవుడ్‌, హాలీవుడ్‌, సౌత్‌ సినీ పరిశ్రమలకు చెందిన తారలు సందడి చేశారు.

ఈ ఈవెంట్​లో నీతా అంబానీ త‌న డ్యాన్స్​తో ఆకట్టుకున్నారు. ఆమె ఓ క్లాసికల్ డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. అవకాశం వచ్చిన ప్రతిసారి నీతా అంబానీ తన టాలెంట్​ను ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్​ఎంఏసీసీ లాంచ్ ఈవెంట్​లో నీతా అంబానీ.. రఘుపతి రాఘవ రాజారాం అనే పాటకు క్లాసికల్ డ్యాన్స్ చేశారు. బాలీవుడ్ స్టార్ సింగర్ శ్రెయా ఘోషల్ ఈ పాటను ఆలపించగా.. తన గ్రూపుతో పాటు నీతా ప్రదర్శన ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version