నిజాలే మాట్లాడే నీతిమంతులైతిరి.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సెన్సేషనల్ కామెంట్స్

-

కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ తరచు విమర్శలు చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి…బతుకే ఇంత.. రోజుకో మాట పూటకో అబద్దం’ అంటూ ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేసింది.బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

‘ఇగ అబద్దాల గురించి మీరే చెప్పాలే మాకు..!! దళితుడిని సీఎం చేస్తానన్న దగ్గరి నుండి.. అదే దళితుడికి మూడెకరాల భూమి ఇస్తానన్న నిక్కమైన నిజాలే మాట్లాడే నీతిమంతులైతిరి!! సిగ్గుండాలే మాట్లాడనీకే.!!’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఓటమితో మెదడు సన్నబారి.. సన్నవడ్ల మీద రాజకీయం మొదలెట్టిన సన్నాసి.. ఇంకెన్ని విషప్రచారాలు చేస్తావ్?మాటకు హద్దుండాలే.. గెలుపుపై ఆశలు సన్నగిల్లి.. సన్న వడ్లపై ఏంది మీ లొల్లి?! అని కేసీఆర్ ఫొటోను అటాచ్చేస్తూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version