మోదీతో నో పాలిటిక్స్..కానీ అందులో జగన్ సక్సెస్!

-

తెలంగాణకు మోదీ వచ్చిన దగ్గర నుంచి అక్కడ అధికార టీఆర్ఎస్ ఓ రేంజ్ లో రాజకీయం చేసిన విషయం తెలిసిందే. తమ రాజకీయ ప్రత్యర్ధి అయిన మోదీకి వెల్కం చెప్పేందుకు కూడా కేసీఆర్ వెళ్లలేదు. పైగా మోదీ టార్గెట్ గా రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ప్రచారంలో ఓ రేంజ్ లో కేసీఆర్ ఫైర్ అయ్యారు. తనదైన శైలిలో మోదీపై విమర్శలు చేశారు…టీఆర్ఎస్ నేతలు సైతం బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారు. అటు బీజేపీ నేతలు కూడా కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

కానీ మోదీ మాత్రం కేసీఆర్, టీఆర్ఎస్ పేరు తీయకుండా కేంద్రం, తెలంగాణకు ఏం చేసిందో చెప్పారు. ఇక దీనిపై కూడా టీఆర్ఎస్ నేతలు మోదీపై ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పలేక పారిపోయారని టీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. అంటే తెలంగాణలో మోదీ పర్యటన పెద్ద రాజకీయ దుమారమే రేపుతోంది.

కానీ ఏపీలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చిన మోదీపై ఏపీ నేతలు ఎలాంటి విమర్శలు చేయలేదు. ఏదో కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతల తప్ప…ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మోదీకి స్వాగతం పలికాయి. అలాగే భీమవరంలో జరిగిన సభలో అటు మోదీ గాని, ఇటు జగన్ గాని రాజకీయపరమైన అంశాలు మాట్లాడలేదు. మోదీ కేవలం గిరిజనులు, ఆదివాసుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి మాట్లాడారు. అంటే ఏపీలో మోదీ విషయంలో ఎలాంటి రాజకీయం జరగలేదు.

కాకపోతే సభ విషయంలో రాజకీయమే నడిచింది…అధికార వైసీపీ…సభకు చంద్రబాబు గాని, పవన్ గాని.అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుని రానివ్వకుండా చేసిందని చెప్పొచ్చు. ప్రధాని మోదీ పర్యటనకు ఆహ్వానం కేవలం టీడీపీ, జనసేన నుంచి ఎవరైనా ప్రతినిధులని పంపమని ఆహ్వానం వచ్చిందే తప్ప…డైరక్ట్ గా చంద్రబాబుని గాని, పవన్ గాని అల్లూరి విగ్రహావిష్కరణకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించలేదు.

పైగా టీడీపీ నుంచి వచ్చిన ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరు పీఏంఓ లిస్ట్ లో ఉన్నా సరే…పేరు లేదని చెప్పి కలెక్టర్ అచ్చెన్నని సభకు రానివ్వలేదు. అటు రఘురామని రానివ్వకుండా ఏ విధంగా చేశారో తెలిసిందే. మొత్తం మీద మోదీ విషయంలో ఎలాంటి రాజకీయం చేయని జగన్…తన ప్రత్యర్ధులకు బ్రేకులు వేసి రాజకీయంగా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version