కరోనా ఫండ్స్ కోసం…ధనవంతుల నుండి పన్నులు వసూళ్లు చేయండి: నోబుల్ విజేత

-

భారత్ లో కరోనాను నివారణకు అవసరమైన నిధులను సేకరించాలంటే దేశంలోని ధనవంతుల నుంచి ఎక్కువ పన్ను వసూలు చేయాలని సూచించారు అమెరికా ఆర్థికవేత్త, నోబుల్ విజేత జోసెఫ్ స్టింగ్లిజ్. ఇండియా కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు….వైరస్ బారిన పడిన నిరుపేదలను ఆదుకునేందుకు ఖర్చుకోసం వెనకాడకూడదన్నారు. కోల్ కతాలో ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టింగ్లిజ్ పాల్గొన్నారు.

దేశంలో ఎక్కువగా ఖర్చయ్యే రంగాలకు తగిన రీతిలో ఖర్చు చేయాలని సూచించారు స్టింగ్లిజ్. భారత్ లో లెక్కకు మించి కోటీశ్వరులు ఉన్నారని..వారంతా ముందుకొచ్చి కరోనాను తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి నిధులు అందించాలని సూచించారు. అమెరికా, భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని…ఇండియాలో వలస కార్మికుల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. కాగా ఇటీవల ప్రపంచంలోని 80 మంది అత్యధిక ధనవంతులు పలు ప్రభుత్వాలకు లేఖలు రాస్తూ… కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు అత్యంత ధనవంతులపై అధిక పన్నులు విధించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version