టెంపర్, బాహుబలి, ఊపిరి వంటి చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో అందాలు ఆరబోసిన కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహి శుక్రవారం ఆకస్మాత్తుగా ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకునే సరికీ ఆమె అభిమానులకు ఏమి జరిగిందో అర్థం కాలేదు. 36.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ నుంచి ఆమె ఎందుకు క్విట్ అయిందో తెలియక సమతమతమయ్యారు. అయితే ఆ తరువాత కొద్ది గంటల్లోనే ఆమె తిరిగి ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యక్షం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇంతకూ జరిగిందేమిటంటే.. శుక్రవారం ఉదయం నుంచి నోరా ఫతేహీ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేయాలని ప్రయత్నించారట. దీంతో కొంత సేపు అది డీ యాక్టివేట్ అయిందని ఆ తరువాత ఇన్‌స్టా టీమ్ తిరిగి తన అకౌంట్‌ను యాక్టివేట్ చేసిందని నోరా ఫతేహీ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవడం కోసం నోరా తన స్నేహితులతో కలిసి దుబాయ్‌కు వెళ్లింది. ఒక్కరోజు ముందే ఆమె అక్కడ సింహాలకు ఆహారం తినిపిస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో పెట్టిన కొద్ది గంటలకే నోరా ఇన్‌స్టా అకౌంట్ డిజిప్పియర్ కావడంతో ఏమైందో అర్థంకాక ఫ్యాన్స్కంగారు పడ్డారు. జరిగిన విషయాన్ని ఆమె తెలియజేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.