మా అమ్మ గారిది కూడా కర్ణాటకనే : ఎన్టీఆర్

-

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్, చరణ్ ,అలియా భట్ లు బెంగుళూరు లో ఈవెంట్ ఏర్పాటు చేసి ఆర్ఆర్ఆర్ కన్నడ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో పునీత్ లోటు కన్పిస్తోంది అన్నారు. తాను బెంగుళూరు వచ్చిన ప్రతిసారీ పునీత్ ను కలిసేవాడిని అని చెప్పారు.

పునీత్ సినిమా లో తాను పాడిన పాటకు కూడా స్టేజ్ పై పాడి వినిపించారు. అంతే కాకుండా కన్నడ ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని…తన తల్లి కూడా ఇక్కడి వారే అని చెప్పారు. ఈ సినిమాలో తాను సొంతంగా డబ్బింగ్ చెప్పాను అంటూ ఎన్టీఆర్ స్పీచ్ మొత్తం కన్నడ లోనే మాట్లాడారు. కన్నడలో మాట్లాడటం చాలా ఆనందం గా ఉందని….ఆర్ఆర్ఆర్ కన్నడ లో డబ్ కావడం కూడా చాలా సంతోషం గా ఉందని ఎన్టీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version