దేశవ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి సమయం నుంచి ఫాస్టాగ్ నిబంధన తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అంటే దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ప్లాజా వద్ద ఫాస్టాగ్ ఇక తప్పనిసరి. ఒకవేళ ఫాస్టాగ్ లేకుండా గనక వెళితే అక్కడ రెండింతల రుసుము వసూలు చేస్తున్నట్లుగా భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే హైదరాబాద్ చుట్టూ ఉన్న బాహ్య వలయం అంటే అవుటర్ రింగ్ రోడ్డు మీద ఈ ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి కాదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
ఇక్కడ నగదు సంబంధిత చెల్లింపులు కూడా కొనసాగుతాయని అధికారులు ప్రకటించారు. అయితే ఎప్పుడైతే ఫాస్టాగ్ ఉన్న కారు ఒక జర్నీ చేసి వెంటనే 24 గంటల లోపుగా తిరిగి వస్తుందో అప్పుడు 50 శాతం రాయితీ ఇస్తామని కానీ నగదు చెల్లింపుల విషయంలో ఎలాంటి రాయితీలు ఏమీ ఉండవని అధికారులు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకునేందుకు ట్రాఫిక్ కష్టాలను మరిపించేందుకు గాను మన గత ప్రభుత్వాలు ఈ ఓఆర్ఆర్ ని నిర్మించిన సంగతి తెలిసిందే.