కాక..ఏం చేస్తివి..నీ డ్యాన్స్ కు స్టార్స్ ఫిధా..వీడియో..

-

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫెమస్ అవుతున్నారు.. ఏదొక వీడియో పెట్టి పాపులర్ అవుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. టాలెంట్ అనేది ఎవరి సొంతం కాదు.. ఎప్పుడోసారి బయట పడుతుంది.. చిన్న వయస్సు వారికన్నా కూడా పెద్ద వాళ్ళే ఎక్కువ తమ టాలెంట్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.. ట్యాలెంట్ ను నిరూపించుకునేందుకు వయసుతో సంబంధం లేదు.

ఈ క్రమంలో చిన్నారులు వయసుకు మించిన పనులు చేసి ఆశ్చర్యపరుస్తుంటే.. పెద్దవాళ్లు వయసు మళ్లాక తమ లోని కళను బయటపెడుతూ ఆశ్చర్య పరుస్తున్నారు. అయితే, వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య అని మాత్రమే నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అంకుల్స్ డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం వంటి ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి.

ఇలాంటి వీడియోలన్ చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి.. అద్భుతంగా డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. వయసులో పెద్దవాడే కానీ.. ట్యాలెంట్ లో యువకుడే అన్న విషయాన్ని నిరూపితం చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించారు. ఆయన వేసిన స్టెప్పులు చూస్తుంటే వయసు ముఖ్యం కాదనే విషయం తెలుస్తోంది. ‘యార్ మేరా తిత్లియాన్ వర్గా…’ అనే సూపర్‌ హిట్ పంజాబీ పాటకు చేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ సూపరో సూపర్ అంతే.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో పాటు కామెంట్లు కూడా అందుకుంటుంది.. ఆ డ్యాన్స్ మీరు కూడా చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version