దేశంలో ఓమిక్రాన్ కల్లోలం…. మూడో స్థానంలో తెలంగాణ…

-

దేశంలో  ఓమిక్రాన్ కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకు ఓమిక్రాన్ కేసులు ఇతర రాష్ట్రాలకు కూడా ఓమిక్రాన్ కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే 17 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే ఇండియాలో 39 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న తెలంగాణ కొత్తగా 14 కేసులు, కేరళలో 9, రాజస్థాన్ 4, ఢిల్లీ 3, బెంగాల్ 2, ఏపీలో 1 కేసు నమోదైంది. దీంతో పాటు హర్యాన్ రాష్ట్రంలో తొలిసారిగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో 6 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 257కు పెరిగింది.

దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య పరంగా తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో  ఉంది. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాతి స్థానంలో నిలిచింది. తెలంగాణలో నిన్న కొత్త కేసులతో కేసుల సంఖ్య 38కి  చేరింది. మరో తెలుగు రాష్ట్రం ఏపీలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 2కు చేరింది. ఇదిలా ఉంటే దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ఇప్పటికే అలెర్టగా ఉండాలని సూచించింది. మరో వైపు ప్రధాని మోదీ నేడు దేశంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news