శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. ఈ నెల 27న అమ్మ ఒడి మూడో విడత నిధులు

-

జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మ ఒడి స్కీం కూడా ఒకటి. నవరత్నాలలో భాగమే ఈ పథకం. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు నిధుల పంపిణీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం అంటోంది. ఇందులో భాగంగానే అమ్మఒడి మూడో విడత నిధులను ఈ నెల 27వ తేదీన జమ చేయాలని భావిస్తోంది.


అంటే 2021 సంవత్సరం లో అక్టోబరు – డిసెంబరు నెలకు సంబంధించి జగనన్న విద్యా దీవెన పథకం కింద ఈ ఆర్థిక సహాయం చేయనుంది. ఈసారి దాదాపు 41 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. దీంతో ఒకేసారి రూ. 709 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే విద్యార్థులు కాలేజీలకు చర్చించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని విద్యార్థుల తల్లులకు అందజేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version