BREAKING: షూటింగ్‌లో తీవ్రంగా గాయాలతో ఆస్పత్రిలో చేరిన హీరో

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట ప్రేమ చదరంగం వంటి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు విశాల్. ఆ తర్వాత వచ్చిన పందెంకోడి చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఒకేసారి తెలుగులో తమిళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

ఇది ఇలా ఉండగా హీరో విశాల్ మరోసారి గాయపడినట్లు సమాచారం అందుతోంది. ఇటీవలే ‘లాఠీ’ షూటింగ్ సమయంలో గాయపడ్డ ఈ హీరో కోలుకుని తాజాగా కెమెరా ముందుకొచ్చాడు. చెన్నైలో ఈ తెల్లవారుజామున ‘మార్క్ ఆంటోని’ షూటింగ్ సమయంలో మరోసారి తీవ్రంగా గాయపడ్డట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్ ఆంటోని’.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version