`దిశ` నిందితుల ఎన్‌కౌంట‌ర్‌పై సుప్రీంలో మరో పిటిషన్

-

దిశ ఎన్‌కౌంటర్‌ ఘటన నిజమైనదా, బూటకమా! అన్న అంశంలో ఎన్ని అనుమానాలు ఉన్నా పోలీసులు చేసిందీ సబబేనంటూ సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న విషయం తెల్సిందే. అయితే దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ అడ్వకేట్ ఎంఎల్ శర్మ ఈ పిటిషన్ వేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపడాన్ని సమర్ధించిన రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌పై చర్యలు తీసుకోవాలని కూడా పిటిషనర్ కోరారు.

అత్యాచారం కేసుల్లో నిందితులు దోషులుగా తేలేంతవరకూ టీవీ ఛానల్స్‌లో చర్చా కార్యక్రమాలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును శర్మ కోరారు. కాగా, దీనికి ముందు న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్‌లు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2014లో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాల ఉల్లంఘన జరిగిందని వీరు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు, విచారణకు, ఈ ఘటనలో ప్రమేయమున్న పోలీసు సిబ్బందిపై చర్యలకు ఆదేశించాలని వారు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news