కరోనా.. తెలంగాణలో కొత్తగా 2 కేసులే..

-

తెలంగాణలో సోమవారం కొత్తగా రెండు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1003కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఈ రోజు కరోనా నుంచి కోలుకున్న 16 మంది బాధితులను వైద్యులు డిశ్చార్జి చేశారు. దీంతో తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 332కు చేరింది. మరోవైపు ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా 26 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 646 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఈ రోజు నమోదైన కేసులు రెండు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీలో కరోనా కేసుల సంఖ్య 556కి చేరింది. వీరిలో 18 మంది మరణించగా, 138 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. 400 మంది చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ తర్వాత అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 83, నిజామాబాద్‌ జిల్లాలో 61 కేసులు నమోదయ్యాయి.

కాగా, తెలంగాణలో గత నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నాలుగు రోజులు కేవలం 20 లోపే కరోనా కేసులు నమోదయ్యయి. నేడు అతి తక్కువ సంఖ్యలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు కావడం తెలంగాణ ప్రజానీకానికి ఊరట కలిగించే అంశం.

Read more RELATED
Recommended to you

Exit mobile version