బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మూడో రోజు కూడా తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళనలకు తగ్గేదేలేదని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కాస్త దిగొచ్చిన సర్కారు బాసర ట్రిపుల్ ఐటి డైరెక్టర్ గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ని నియమించింది.
ఆయన విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చింది. కానీ విద్యార్థులు మాత్రం డైరెక్టర్ నియామకంతో సమస్యలు పరిష్కారం కావని అంటున్నారు. వీసీ తోనే సమస్యలు పరిష్కారం కానప్పుడు డైరెక్టర్ నియామకం తో ఉపయోగం లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ వద్దకు వస్తే తప్ప ఆందోళన విరమించమని తేల్చి చెబుతున్నారు.