తమది కూల్చే ప్రభుత్వం కాదని.. ఆస్తులు కాపాడే ప్రభుత్వమని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా ప్రకటించారన్నారు.
ఒక కేంద్ర మంత్రి పదవి ఉత్తరాంధ్రకు ఇచ్చారని చెప్పారు. కూటమిది ప్రజా ప్రభుత్వమని.. ప్రచార ప్రభుత్వం కాదని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు కూల్చే ప్రభుత్వాన్ని చూశామని.. ఇప్పుడు ప్రజా ఆస్తులు కాపాడే ప్రభుత్వాన్ని చూస్తారని చెప్పారు. విజయనగరంలో జరిగిన భూ అక్రమాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నట్లు అప్పలనాయుడు వివరించారు.