ఓవర్ కాన్ఫిడెన్స్: సర్వేల్లో 78..కేసీఆర్ రూట్‌లో కమలం..!

-

ఎన్నికల సమయం దగ్గరపడటంతో అన్నీ సర్వే సంస్థలు తెలంగాణలో ఏ పార్టీకి మొగ్గు ఉంది..మళ్ళీ ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పి సర్వేలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ప్రధాన పార్టీలు సైతం ఎవరికి వారు సొంత సర్వేలు చేయిస్తున్నారు. దాని బట్టి ఇంకా దూకుడుగా రాజకీయం చేయాలని డిసైడ్ అవుతున్నారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 90 పైనే సీట్లు గెలుస్తుందని, సర్వేల్లో అదే తేలిందని కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్ పార్టీ సైతం 72 సీట్లు వస్తాయని చెప్పి చెప్పుకుంది.

కాకపోతే ఈ తరహాలో చెప్పిన సందర్భం లేదు..అధికారంలోకి వస్తామని చెబుతూ వస్తున్నారు గాని..అన్ని సీట్లు గెలుస్తాం..ఇన్ని సీట్లు గెలుస్తామని మాత్రం చెప్పలేదు. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్..బీజేపీ 78 సీట్లలో గెలుస్తుందని చెప్పి జోస్యం చెప్పారు. అవును నిజంగా ఇది జోస్యమే..మరి ఏ సర్వేల్లో తేలిందో తెలియదు గాని..బీజేపీకి 78 సీట్లు వస్తాయని…ఇంకా అభ్యర్ధులని ప్రకటిస్తే 90 సీట్లు కూడా వస్తాయని చెప్పుకొచ్చారు.

అయితే తరుణ్ చుగ్‌కు ఏ సర్వే తెలిసిందో తెలియదు గాని..తెలంగాణలో బీజేపీకి 78 సీట్లు గెలుచుకునే బలం ఇంకా రాలేదని మాత్రం అర్ధమవుతుంది. ఇంకా చెప్పాలంటే 78 సీట్లలో బలమైన అభ్యర్ధులని నిలబెట్టగలిగితే చాలు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి పోటీగా బీజేపీ ఉంది..కాంగ్రెస్ పరిస్తితి దిగజారడంతో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. అందులో వాస్తవం ఉంది. కానీ బలమైన నేతలు ఉన్నచోటే ప్రజలు బీజేపీకి ఓటు వేస్తున్నారు.

అలా కాకుండా బలహీనమైన నేతలు ఉంటే ఓట్లు రాలడం కష్టం. దాని బట్టి చూసుకుంటే ఎన్ని స్థానాల్లో బీజేపీకి బలమైన అభ్యర్ధులు ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ముందు పార్టీని బలోపేతం చేసుకుంటూ, ప్రజలకు అండగా ఉంటే..ఆటోమేటిక్‌గా ప్రజలే గెలిపిస్తారు. కానీ తరుణ్ చుగ్ మాదిరిగా ఓవర్ కాన్ఫిడెన్స్‌కు వెళితే దెబ్బపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version