వార్తలు

వాట్సప్ కు సుప్రీం కోర్టు నోటీసులు

వాట్సప్ సంస్థకు సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. వాట్సాప్ వేదికగా ఫేక్ న్యూస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోవడం, మెసేజింగ్ సేవలు దుర్వినియోగం కావడంతో పాటు వివిధ వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టే ఫ్లాట్ ఫాంగా తయారైంది.  దీంతో  భారత్ లో వెళ్లు వెత్తుతున్న ఫిర్యాదుల సేకరణ కోసం ప్రత్యేక అధికారిని నియమించకపోవడంపై...

ఫైనల్స్ కి చేరిన పీవీ సింధు

మహిళల సింగిల్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారత క్రీడాకారిణి.. తెలుగు తేజం భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా 2018 క్రీడల్లో బ్యాడ్మింటన్ ఫైనల్ కు చేరింది. సోమవారం జరిగిన సెమీ ఫైనల్స్ లో జపాన్ ప్లేయర్ యమగుచిపై 21-17, 15-21,21-10 తేడాతో సింధు విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది....

బీఎస్ఈలో అమరావతి బాండ్ల లిస్టింగ్  షురూ

  గంట కొట్టి లిస్టింగ్ ప్రారంభించి సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఏపీసీఆర్డీఏ జారీ చేసిన బాండ్ల నమోదును  సోమవారం ఉదయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంట కొట్టి ప్రారంభించారు. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్సీ)లో అమరావతి బాండ్లు లిస్ట్ అయ్యాయి. అమరావతి నిర్మాణం కోసం నిధుల సమీకరణకు సీఆర్డీఏ ఎలక్ట్రానిక్...

అఖిలపక్షంతో నేడు ఈసీ భేటీ

త్వరలో రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సరళి, ఓటింగ్ విధానం, ఓటర్ల జాబితా.. ఇతర అంశాల గురించి చర్చించేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి ఏడు జాతీయ, 51 ప్రాంతీయ పార్టీలను ఎన్నికల కమిషన్ ఆహ్వానించింది. రాజకీయ పార్టీలకు చర్చకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ.....

నిండు కుండలా నాగార్జునసాగర్

ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తోంది. ఆదివారం సాయంత్రానికి 262 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని అధిగమించింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకుగాను ఎగువ నుంచి జలాశయంలోకి 73వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో ప్రస్తుతం 572.20 అడుగులకు చేరింది. శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గడంతో...

బ్యూటీషియన్ హత్యాయత్నం కేసులో ఊహించని పరిణామం..

నిందితుడు నూతన్ రైలు కింద పడి బలవన్మరణం విజయవాడ సమీపంలోని హనుమాన్ జంక్షన్ లో రెండు రోజుల క్రితం జరిగిన బ్యూటీషియన్ పద్మ పై హత్యాయత్నం కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పద్మపై దాడి చేసిన ప్రియుడు నూతన్ పోలీసులకు భయపడి తప్పించుకుని పారిపోయిన సంగతి తెలసిందే.. దీంతో పోలీసులు ఈ కేసుని ఎంతో ప్రతిష్టాత్మకంగా...

తెలంగాణ జేఏసీ సమావేశం రసాభాస

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశంలో గందరగోళం నెలకొంది. హైదరబాద్లోని తాజ్ డెక్కన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై చర్చ జరుగుతోంది. దీనిపై తెలంగాణ ఐకాస ఛైర్మన్ రఘు అన్ని విషయాలను వివరిస్తుండగా నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఉద్యోగి శ్యాంప్రసాద్ అడ్డుకున్నారు. దీంతో...

కేంద్ర హోంమంత్రితో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటనలో భాగంగా నేడు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ లో ఉన్న అంశాలు, రక్షణ శాఖకు సంబంధించిన భూముల విషయం, జోనల్ వ్యవస్థ,..ఇతర అంశాలపై చర్చించారు. సీఎంతో పాటు ఎంపీలు వినోద్, బూర నర్సయ్యగౌడ్ ఉన్నారు.

సింగరేణికి మరో అంతర్జాతీయ అవార్డు

ఆసియాలోనే అత్యంత విశ్వసనీయ సంస్థగా సింగరేణికి మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. దీంతో ఆదివారం సాయంత్రం బ్యాంకాక్ లో జరగనున్న కార్యక్రమంలో సింగరేణి ఎండీ ఈ అవార్డును అందుకోనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు ఎంపీ కవిత హర్షం వ్యక్తం...

పత్రికపై రూ.5వేల కోట్ల పరువు నష్టం దావా వేసిన అనిల్ అంబానీ

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు డీల్ విషయంలో కాంగ్రెస్ కు అనిల్ అంబానీ షాకిచ్చారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ పత్రికపై  రూ. 5వేల కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఆ పత్రిక రాసిన అసత్య కథనాలపై అంబానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు అంటూ కాంగ్రెస్ నేతలను పలుమార్లు...
- Advertisement -

Latest News

యూపీఐ అంటే ఏమిటి? మనీ ఎలా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు

సాధారణంగా మనం యూపీఐతో క్షణాల్లో నగదు బదిలీ చేసుకోగలం. దీంతో ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్స్‌కు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూపీఐ అంటే...
- Advertisement -