భారత సరిహద్దు జలాల్లోకి పాకిస్థాన్ కు చెందిన 11 బోట్లు ప్రవేశించాయి. ఈ 11 బోట్లను సరిహద్దు భద్రతా దళాలు సీజ్ చేశాయి. అయితే బోట్లకు సంబంధించిన వ్యక్తుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కాగ పాకిస్థాన్ చెందిన 11 బోట్లు గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని హరమినాలా తీర ప్రాంతంలో వెలుగు చూశాయి. భద్రతా బలగాలు చేసిన సెర్చు ఆపరేషన్ లో ఈ బోట్లు బయట పడ్డాయి. కాగ ఈ బోట్లు భారత జలాల్లోకి ఎందుకు వచ్చాయని అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
అలాగే బోట్లుకు చెందిన వ్యక్తుల కోసం కూడా భద్రతా బలగాలు సెర్చ్ చేస్తున్నాయి. కాగ బోట్లు లభ్యం అయిన ప్రాంతంలో దట్టమైన చెట్లు ఉండటంతో పాటు సముద్రపు ఆలలు కూడా తీవ్రంగా ఉన్నాయి. దీంతో భద్రతా బలగాల గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఇండియా – పాక్ మధ్య జాలర్ల విషయంలో వివాదం చోటుసుకుంటుది. చేపల వేటుకు వేళ్లిన జాలర్లను పాకిస్తాన్ అక్రమంగా బంధీస్తుంది. ఈ మధ్య కాలంలోనే దాదాపు 50 మంది భారత జాలర్లను పాక్ అక్రమంగా బంధీలుగా చేసింది.