టీమిండియాతో మ్యాచ్‌లో పాకిస్తాన్ 19.4 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఇప్తికర్ అహ్మద్ 28 పరుగులు చేశాడు. చివర్లో షానావాజ్ దవాని 6 బంతుల్లో 16 పరుగులు, హారిస్ రౌఫ్ 7 బంతుల్లో 13 పరుగులు చేయడంతో పాకిస్తాన్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ 4, హార్దిక్ పాండ్యా 3, అర్ష్‌దీప్ సింగ్ 2, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు కూడా.. పాకిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్(1) కీపర్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో పాక్ ఏడో వికెట్కోల్పోయింది. అంతకముందు 9 పరుగులు చేసిన ఆసిఫ్ అలీ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
దీంతో పాకిస్తాన్ 112 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. తొలుత మంచి ఫామ్‌లో ఉన్న మహ్మద్ రిజ్వాన్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించిన పాండ్యా.. ఆ తర్వాత 2 పరుగులు చేసిన కుష్‌దిల్‌ను పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో 28 పరుగులు చేసిన ఇఫ్తికర్ అహ్మద్ కీపర్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.