ఎమ్మెల్యే వనమా కొడుకును ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు..? ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి- కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య పొలిటికల్ గా ప్రకంపనలు కలిగిస్తోంది. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. పోలీసులు రాఘవేంద్ర రావును అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత కోమిటి రెడ్ది వెంటక్ రెడ్డి ఫైర్ అయ్యాడు.komatireddy venkat reddy

రామక్రిష్ణ కుటుంబం వనమా రాఘవేంద్ర రావు చేత చంపబడిందని తీవ్రస్తాయిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్దారు. సభ్య సమాజం తలదించుకునేలా.. ఓ ఎమ్మెల్యే కుమారుడు ప్రవర్తించాడని విమర్శించారు. డీజీపీ వెంటనే రాఘవను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.  ఎమ్మెల్యేల కుమారులు సెటిట్మెంట్ చేస్తుంటే… పోలీసులు నిమ్మకు నీరెత్తని విధంగా ఉన్నారని విమర్శించాడు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే కొడుకును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. హోం మినిష్టర్ దగ్గర పవర్స్ లేవన్నారు. ముఖ్యమంత్రి కూడా సొంత పార్టీ అని చూడకుండా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నీ పార్టీ పరువు పోతుందని సీఎం అరెస్ట్ చేయడం లేదని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల కొడుకులు వేల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు.