వక్ఫ్ సవరణ బిల్లు పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజు వరకు పొడగిస్తూ లోక్ సభలో గురువారం తీర్మాణాన్ని ఆమోదించారు. కమిటీ చైర్మన్, బీజేపీ నేత జగదాంబిక పాల్ లోక్ సభలో తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో దీనిని ఆమోదించారు. గత వర్షాకాల సమావేశాల్లో వక్ఫ్ బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ బిల్లు పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాజ్యసభ, లోక్ సభలోని అధికార, విపక్ష ఎంపీలతో కలిపి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ శీతాకాల సమావేవాల్లోనే కమిటీ తన నివేదికను పార్లమెంట్ కి సమర్పించాల్సి ఉంది.
ప్రతిపక్షాలతో పాటు పలువురు బీజేపీ ఎంపీలు కమిటీ కాల పరిమితిని పొడగించాలని కోరారు. వాస్తవానికి శీతాకాల సమావేశాలలో మొదటివారం చివరి శుక్రవారం తన నివేదికను సమర్పించాల్సి ఉంది. ప్రస్తుత వక్ఫ్ చట్టంలో బిల్లు ప్రతిపాదించిన సవరణలు ముస్లింల మత పరమైన హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ సవరణల వల్ల వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకత వస్తుందని.. వాటికి జవాబు దారితనం ఉంటుందని పేర్కొంది బీజేపీ.