జనసేన అధినేత ఈసారి జరగనున్న ఎన్నికల్లో తన సత్తా చాటాలని గట్టిగానే కృషి చేస్తున్నారు, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వారాహి అన్న వాహనంలో యాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే రెండు విడుతలు పూర్తి అయినాయి .. రెండు సార్లు కూడా ప్రజలు పవన్ ను స్వాగతించి పెద్ద సంఖ్యలో ఈ యాత్రకు తరలి వచ్చారు. కాగా మూడవ యాత్ర సైతం త్వరలోనే జరగనుందని జనసేన రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రకటించారు. జరిగిన రెండు యాత్రలు కూడా సక్సెస్ అయ్యాయి, ఇక త్వరలో జరగనున్న మూడవ యాత్రను కూడా జనసేన వీర మహిళలు మరియు జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు నాదెండ్ల. మూడవ విడుత వారాహి యాత్ర విశాఖపట్టణం నుండి మొదలు అవుతుందని తెలిపారు నాదెండ్ల మనోహర్. అయితే పక్కా షెడ్యూల్ ను ప్రకటించకపోయినా త్వరలోనే మొదలు కానున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ “జనసేన” 3వ విడత వారాహి యాత్ర ఇక్కడి నుంచే … !
-