బీజేపీ హైకమాండ్‌ను ఒప్పిస్తా – పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

-

పొత్తులపై బీజేపీ హైకమాండ్‌ను ఒప్పిస్తానని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానని.. రాజధాని విషయంలో బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించినట్లే.. ఓట్ల చీలిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.


రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే ఓట్లను చీలనివ్వకూడదనే నిర్ణయం తీసుకున్నామని.. రాజకీయ ప్రయోజనాలకన్నా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని వెల్లడించారు. ఎవరితో పొత్తులకు వెళ్లాలో మాకు వైసీపీ చెప్పాల్సిన అవసరం లేదని… మంత్రి పదవులను మేం చెప్పిన వాళ్లకు జగన్ ఇస్తారా..? అని ప్రశ్నించారు. ఓట్లు చీలనివ్వమన్న చిన్న పదానికి వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే ఏం చెప్పలేనని వెల్లడించారు.

రాష్ట్రం బలంగా ఉంటే.. జనసేన బలంగా ఉన్నట్లేనని.. ఎక్కడ పోటీ చేసినా నన్ను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని చెప్పారు. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయని.. నన్ను విమర్శించిన మాజీ మంత్రులకు ఇప్పటికైనా తెలిసుండాలని.. నన్ను తిడితే పదవి కలకలకాలం నిలవదని వైసీపీ నేతలు గ్రహించే ఉంటారని తెలిపారు. సీపీఎస్‌ విధానానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని.. లక్షల కోట్లు విదేశాలకు తరలించే తెలివితేటలున్నపుడు.. సీపీఎస్‌ సమస్యను పరిష్కరించే తెలివి తేటలు ఉండవా?అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version