ఏపీలో బలపడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టిగానే ట్రై చేస్తున్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా మంచి ఫలితాలు రాబట్టాలని ఛూస్తున్నారు…అధికారంలోకి వచ్చేంత బలం లేకపోయినా కనీసం..ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని పవన్ అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో దారుణ ఫలితాలు వచ్చినా సరే..ఈ సారి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని చూస్తున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు చాలావరకు జనసేన పార్టీ బలపడిందనే చెప్పాలి…అలాగే పవన్ సైతం దూకుడుగానే రాజకీయం చేస్తున్నారు…గతం కంటే ఎక్కువగానే ప్రజల్లో ఉంటూ..వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
నిజానికి గత ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో జనసేనకు ఓట్లు బాగానే పడ్డాయి…అలాంటి నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేస్తే నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ పవన్ అంతగా ఫోకస్ చేస్తున్నట్లు కనిపించడం లేదు…చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు లేరు. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, కైకలూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో జనసేనకు ఓటింగ్ బాగానే ఉంది..కానీ వీటిలో ఒక్క విజయవాడ లో తప్ప మిగిలిన చోట్ల జనసేనకు బలమైన నాయకులు లేరు. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా జనసేనకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. కానీ తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఏలూరు, లాంటి స్థానాల్లో జనసేనకు బలమైన నాయకత్వం లేదు. భీమవరం, నరసాపురంల్లో బలంగా ఉంది.
ఇక తూర్పు గోదావరి విషయానికొస్తే…మండపేట, పెద్దాపురం, అమలాపురం, కొత్తపేట, పిఠాపురం, కాకినాడ సిటీ, రూరల్ లాంటి స్థానాల్లో జనసేనకు బలం ఉంది. కానీ బలమైన నాయకులు లేరు. రాజోలు, ముమ్మిడివరం స్థానాల్లో స్ట్రాంగ్ గానే ఉంది. మొత్తానికైతే పవన్ పట్టున్న స్థానాలపై ఇంకా ఫోకస్ పెట్టి పనిచేయాల్సిన అవసరం ఉంది.