మూడు రాజధానుల రద్దుపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని.. ముందుంది అసలు సినిమా అంటూ… పేర్కొన్నారు మంత్రి పెద్దిరెడ్డి. రాజధాని విషయంలో త్వరలోనే శుభం కార్డు పడుతుందని ఆయన వెల్లడించారు. టెక్నికల్ సమస్యలు సరిదిద్దేందుకు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని స్పష్టం చేశారు.
తాను ఇప్పటికీ మూడు రాజధానుల కే కట్టుబడి ఉన్నానని ప్రకటించారు. ఉపసంహరణ అమరావతి రైతుల విజయం కాదని… పాదయాత్ర చూసి చట్టం ఉపసంహరించుకోలేదని చెప్పారు పెద్దిరెడ్డి. తాను కేబినెట్ మీటింగ్ లో పాల్గొనలేదు.. కాబట్టి పూర్తిగా వివరాలు తెలియవన్నారు. అసలు రాజధాని కోసం పాదయాత్ర చేసేది టిడిపి పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయం ఇంకా తీసుకోలేదు అని పేర్కొన్నారు. కాగా మూడు రాజధానులు విషయం పై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించు కుంటున్నట్లు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.