ఆకలితో ఉన్నవారికే టెస్టు అవకాశాలు వస్తాయని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను మాజీ ఆటగాళ్లు సమర్థిస్తున్నారు.ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్లో యంగ్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్,ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, శుభ్మన్ గిల్, ఆకాశీప్ మెరుగైన ప్రదర్శనతో అవకాశాలు సద్వినియోగం చేసుకోగా రంజీ ట్రోఫీలో తమ రాష్ట్రాల తరఫున ఆడమని బీసీసీఐ ఆదేశించినా శ్రేయస్ అయ్యర్,ఇషాన్ కిషన్ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడంతో రోహిత్ ఆ వ్యాఖ్యలు చేశాడు.
ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ కూడా రోహిత్ శర్మ వాఖ్యలు సమర్థించాడు.’రంజీల్లో ఆడటం చాలా ముఖ్యం. దీనివల్ల విదేశాల్లో మంచి ప్రదర్శన చేయొచ్చు అని సూచించారు. రంజీల్లో ఎవరైనా ఆడనంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. క్రికెట్ కంటే పెద్దవాళ్లు ఎవరూ లేదు’ అని పేర్కొన్నారు. “కచ్చితంగా రంజీట్రోఫీ ఆడాలనే నియమం తీసుకురాకుంటే రానున్న రోజుల్లో రంజీ ట్రోఫీ అంతరించిపోయే ప్రమాదముంది అని అన్నారు. కేంద్ర కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లు రంజీలకు అందుబాటులో ఉండాలని ఇషాన్, శ్రేయస్ లకు సూచించారు. కాని వారు రంజీలు ఆడటానికి నిరాకరించడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు చేసిన విషయం తెలిసిందే.