గతంలో యూరియా కోసం రైతులు లాఠీ దెబ్బలు కూడా తిన్నారు : మోడీ

-

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం చేరుకున్నారు భారత ప్రధాని మోడీ. ఎరువుల కర్మగారాన్ని, భద్రాచలం-సత్తుపల్లి రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఆ అధికారం కేంద్రానికి లేదని చెప్పారు మోడీ. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా..కేంద్రానికి 49 శాతం వాటా ఉందన్నారు. సింగరేణి బొగ్గు గనులపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పుకార్లను నమ్మవద్దని మోడీ సూచించారు. సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని కొందరు హైదరాబాద్ నుంచి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో గతంలో అనేక స్కాంలు జరిగాయని ఆరోపించారు.

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం వల్ల రైతులకు ఎరువుల కొరత తీరిందని ప్రధాని మోడీ అన్నారు. గతంలో ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడేవాళ్లమని చెప్పారు. కానీ ప్రస్తుతం దేశంలో గోరఖ్ పూర్ , రామగుండంతో పాటు..మరో 5 ప్రాంతాల్లో ఎరువుల ఉత్పత్తి జరుగుతోందన్నారు మోడీ. దీని వల్ల భారతే ప్రపంచ దేశాలకు ఎరువులను ఎగుమతి చేస్తోందని తెలిపారు మోడీ. దేశంలో ఫర్టిలైజర్ సెక్టార్ను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గతంలో యూరియా కోసం రైతులు అర్థరాత్రి వరకు క్యూలైన్లలో నిల్చునేవారని..యూరియా కోసం రైతులు లాఠీ దెబ్బలు కూడా తిన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో వ్యవసాయానికి సరిపడా యూరియా ఉత్పత్తి అవుతోందన్నారు మోడీ. దేశంలో యూరియా బ్లాక్ మార్కెట్ను అరికట్టామన్నారు. ప్రపంచ దేశాల్లో ఎరువుల రేట్లు పెరిగినా.. భారత్లో మాత్రం ఎరువుల రేట్లను పెంచలేదన్నారు మోడీ. పైగా ఎరువుల రేట్లను తగ్గించామన్నారు. గతంలో నకిలీ ఎరువుల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారని..వాటన్నింటిని రద్దు చేశామన్నారు. ప్రస్తుతం దేశంలో భారత్ బ్రాండ్ ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు మోడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version