రాజ్యాంగ దినోత్సవం సంధర్బంగా ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సంధర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలన్నీ డుమ్మా కొట్టాయి. ఇక ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ…. కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలతో దేశం సంక్షభం దిశగా పయనిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడాలనుకునేవారికి అది పెద్ద ఆందోళనగా మారిందని అన్నారు. ఎన్నో తరాలుగా కుటుంబం ఓ పార్టీని నడిపితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదమని చెప్పారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ ఓసారి కుటుంబ పార్టీలను చూడాలంటూ మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా తన ఉద్దేశ్యం ఒక కుటుంబం నుండి ఒకరి కంటే ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావద్దని కాదని ప్రజల ఆధరణ ఉంటే రావచ్చని…కానీ తరాలు మారినా ఒక కుటుంబం ఒక పార్టీని నడపటమే ప్రమాదమని వ్యాఖ్యానించారు.