ప్రధాని భద్రత లోపాన్ని విచారిస్తున్న కమిటీ చైర్మన్ కు బెదిరింపులు

-

పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానికి భద్రత కల్పించడంలో లోపం ఏర్పడిన సంగతి తెలిసింది. దాదాపు 20 నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్ తో చిక్కుకుపోయారు. ఈ వివాదంపై సుప్రీం కోర్ట్ లో సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇటీవల సుప్రింకోర్ట్ జస్టిస్ ఇందూ మల్హోత్రా అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ప్రధాని భద్రత లోపంపై  విచారణ చేయవద్దని జస్టిస్ ఇందూ మల్హోత్రా బెదిరిస్తూ.. సిక్ ఫర్ జస్టిస్( ఎస్ఎఫ్ జే) సంస్థ నుంచి బెదిరిస్తూ ఆడియో విడుదలైంది.

ప్రధాని భద్రతా లోపంపై విచారణను నిలిపివేయాలంటూ.. కమిటీ చైర్మన్ ను బెదిరిస్తూ ఆడియోలో ఉంది. గతంలో కూడా పలువురు సుప్రీం కోర్ట్ జడ్జీలను సిక్ ఫర్ జస్టిస్ సంస్థ బెదిరించింది. జనవరి 5న ప్రధాని మోదీ పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ కు వెళ్లే క్రమంలో భద్రతా వైఫల్యం తలెత్తింది. ప్రధాని స్థాయి వ్యక్తికి పంజాబ్ ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని విమర్శలు వచ్చాయి. ఆందోళనకారులు నిరసనతో ప్రధాని తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆసమయంలో కూడా ఎస్ఎఫ్ జే సంస్థ ప్రధాని భయపడ్డారంటూ.. దీనికి మేమే కారణం అంటూ ఓ వీడియోను ఆ సంస్థ సభ్యుడు గురుపత్వంత్ సింగ్ విడుదల చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news