జూలై 29న 5 రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలా వైమానిక దళ విమానాశ్రయానికి చేరిన విషయం తెలిసిందే. అయితే వాటిని భారత వైమానిక దళంలో చేర్చడానికి భారీ వేడుక జరగనుంది. ఈ వేడుకలో ప్రధాని మోదీతో కలిసి ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే పాల్గొననున్నారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన తేదీని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ తో భారత్ 59 వేల కోట్ల డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా తొలి విడతలో ఐదు విమానాలు భారత్ చేరుకున్నాయి. ఇందులో మూడు సింగిల్ సీటర్ జెట్ ఫైటర్లు, రెండు ట్విస్ సీటర్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఈ రాఫెల్ విమానాలు విరామం లేకుండా 3700 కిలోమీటర్లు ప్రయాణించగలవు. గంటలకు 1389 వేగంతో దూసుకెళ్తాయి. ఇకపోతే రాఫెల్ విమానాన్ని నడపడానికి భారత వాయుసేనకు చెందిన కొంత మంది పైలట్లు ఇప్పటికే ప్రత్యేక శిక్షణను అందుకున్నారు.