పీఓకే ముమ్మాటికి భారత్ దే : అమిత్ షా

-

పాక్ ఆక్రమిత కశ్మీర్  ముమ్మాటికీ భారత్ కే చెందుతుందని, దానిని వెనక్కి తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘ఫరూక్ అబ్దుల్లా, మణిశంకర్ అయ్యర్లు పాకిస్థాన్ లో అణుబాంబు ఉన్నందున గౌరవం ఇవ్వండి అని చెబుతున్నారు. అటువంటి వాటికి బీజేపీ భయపడదు. పీఓకే ముమ్మాటికీ భారత్ దే. ఎప్పటికైనా భారత్లో కలవాల్సిందే’ అని వ్యాఖ్యానించారు.

70 ఏళ్లుగా ఆర్టికల్ 370తో కశ్మీర్ ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇప్పటికే దేశంలో నాలుగు దశల పోలింగ్ పూర్తైంది. ఈ నాలుగు దశల్లో ఇండియా కూటమి తుడిచిపెట్టుకు పోయింది. మోడీ 400 స్థానాలు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు’ అని చెప్పారు. కాగా, అలహాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన నీరజ్ త్రిపాఠి, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, యూపీ శాసనసభ స్పీకర్ కేశరీనాథ్ త్రిపాఠి, రాజ్యసభ ఎంపీ రియోటి రమణ్ సింగ్ కుమారుడు ఉజ్వల్ రామ్ సింగ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ మే 25న ఆరో దశలో భాగంగా పోలింగ్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version