వీటిని అమ్ముతూ రూ.లక్షలు దండుకుంటున్న ముఠా…!

ఇప్పుడు మరొక ముఠా బయట పడింది. వీళ్ళు ఏమి అమ్ముతున్నారో తెలిస్తే నిజంగా షాక్…! ఈ ముఠా నుంచి పోలీసులు ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వాటిని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య బాగా పెరిగింది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా రావడంతో వాళ్లకి ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది దీనితో ఆక్సిజన్ సిలిండర్లు డిమాండ్ బాగా పెరిగింది.

oxygen cylinders
oxygen cylinders

ఈ విషయాన్ని వాళ్ళు లాభదాయకంగా తీసుకుని ఆక్సిజన్ సిలిండర్ దందాకు పాల్పడ్డారు. కొన్ని ప్రదేశాల లో ఆక్సిజన్ లేక కరోనా బాధితులు ప్రాణాలు విడుస్తుంటే. మరోపక్క ఇవేమీ కూడా పట్టించు కోకుండా దందా చేయడం గమనార్హం. ఇలా అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్స్ ని అమ్మి రూ.లక్షలు అమ్ముతున్నారు.

తాజాగా హైదరాబాద్ పోలీసులకు చిక్కింది ఈ ముఠా. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిపై ఆకస్మిక సోదాలు చేసి రెండు ముఠాలని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో అక్రమంగా అమ్ముతున్న రెండు ముఠాల పై కూడా పై దాడులు జరిగాయి అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై నాలుగు ఆక్సిజన్ సిలిండర్లుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా నగరంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కి అలానే క్లినిక్స్ కి కూడా ఆక్సిజన్ సిలిండర్లు అమ్మినట్టు గుర్తించారు పోలీసులు. ఏకంగా ఒక్కొక్క సిలిండర్ కి లక్ష రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన చూడటం వల్ల అనేక రకాలైన అక్రమాలపై మరింత దృష్టి పెడతామని పోలీసులు చెప్పారు. పట్టుకున్న ఆక్సిజన్ సిలిండర్స్ అని వైద్య ఆరోగ్య శాఖ కి అందించారు