హైపర్ ఆదికి తెలంగాణ సెగ.. పోలీసులకు ఫిర్యాదు..

బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమేడియన్ హైపర్ ఆదికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. హైపర్ ఆదిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు. హైపర్ ఆదిపై ఎల్బి నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆదివారం రోజున అంటే నిన్న ఈ-టీవీ చానెల్ లో ప్రసారం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాం ప్రసారం అయింది. అయితే ఈ ప్రోగ్రాంలో తెలంగాణ బతుకమ్మను, గౌరమ్మను, తెలంగాణ భాష మరియు యాసని కించపరిచే విధంగా ఆది స్క్రిప్ట్ చేశాడని ఫిర్యాదు చేశారు.

జబర్దస్త్ హైపర్ అది, స్క్రిప్ట్ రైటర్ మరియు మల్లెమాల ప్రొడక్షన్ పై చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నారు తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు. కాగా కమేడియన్ హైపర్ ఆది ప్రస్తుతం ఈటీవీ చానెల్ లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లాంటి వినోద కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న విషయం తెలిసిందే.