న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఫోకస్

-

న్యూఇయర్ వేడుకలను లక్ష్యంగా చేసుకొని.. డ్రగ్స్ పంపిణీకి స్మగ్లర్లు ప్రణాళికలు రచిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో డ్రగ్స్ స్మగ్లర్లపై పోలీసులు నిఘా పెంచారు. పబ్స్, బార్, ఈవెంట్సేపై ప్రత్యేక దృష్టి పెట్టారు. డ్రగ్స్ విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్ స్మగ్లింగ్పై నార్కోటిక్, SOT పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే.. నూతన సంవత్సరంలోకి సరికొత్త ఉత్సాహంతో అడుగు పెట్టాలనుకునే వారికి రామోజీ ఫిల్మ్‌సిటీ ఆహ్వానం పలుకుతోంది. ఈ నెల 31వ తేదీ రాత్రి ప్రత్యేక కార్యక్రమాలతో కూడిన వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ స్పెషల్‌ న్యూ ఇయర్‌ పార్టీలో ఎన్నో ప్రత్యేకతలను మీ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ ఇండిపాప్‌ గాయకులు లెస్లీలూయిస్‌ ప్రత్యక్ష ప్రదర్శన మైమరిపించనుంది. దేశంలోని నంబర్‌వన్‌ డీజే రింక్‌ పంచే సంగీతంతో ఉత్తేజకరమైన వాతావరణంలో నూతన సంవత్సరంలోకి సరికొత్తగా అడుగిడేందుకు అవకాశం ఉంటుంది. సంగీత హోరు, నృత్యాల జోరు మధ్య 31వ తేదీ రాత్రి ఆనందతీరాలలో తేలియాడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version