బాబుతో పవన్ దోస్తీ… జనసేన సీట్లు కూడా ఫిక్స్ చేసుకుంటున్నారా?

-

జగన్‌ని సింగిల్‌గా ఎదురుకోవడం కష్టమని టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు బాగా క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక జగన్ దెబ్బకు ఎలాగో టి‌డి‌పి పరిస్తితి దిగజారిపోయింది. ఎంత ప్రయత్నించిన పార్టీ పైకి లేవడం లేదు… ఇటు లోకేష్ వల్ల కూడా పార్టీకి పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో కాస్త క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ మద్ధతు తీసుకుంటే జగన్‌ని ఢీకొట్టవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

అటు పవన్ సైతం ఒంటరిగా సాధించేది ఏమి లేదు.. ఒంటరిగా పోటీ చేసి గత ఎన్నికల్లో ఏం సాధించారో అందరికీ తెలుసు. అలాంటప్పుడు బాబుతో కలిస్తే కనీసం కొన్ని సీట్లు అయిన సాధించవచ్చని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టి‌డి‌పి-జనసేనల పొత్తు ఖాయమైందని ప్రచారం నడుస్తోంది. ఈ పొత్తుకు టి‌డి‌పి-జనసేన కార్యకర్తలు కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. పైగా పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

ఎలా లేదన్న జనసేన ఒక 50 సీట్లు తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 175 సీట్లలో టి‌డి‌పి 125 సీట్లు తీసుకుని, జనసేనకు 50 సీట్లు ఇవ్వొచ్చని ప్రచారం వస్తుంది. ఆ 50 సీట్లలో ఎక్కువ సీట్లు కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో తీసుకోవాలని పవన్ భావిస్తున్నారట.

ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాల్లోనే జనసేనకు మంచిగా ఓట్లు పడ్డాయి. ఒక రాజోలు సీటు కూడా గెలుచుకున్నారు కాబట్టి, ఈ జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు డిమాండ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే రాయలసీమలో పెద్దగా బలం లేదు కాబట్టి అక్కడ జనసేన ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశాలు లేదని తెలుస్తోంది. ఇక 50 సీట్లు తీసుకుని…కనీసం 35 సీట్లు పైనే గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారాలని పవన్ చూస్తున్నారట. మరి చూడాలి ఈ పొత్తు వ్యవహారం ఎంతవరకు వెళుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news