ఏబీ వెంకటేశ్వరరావు భవిష్యత్తు ఆనాడే తేల్చేసిన ఆమంచి .. వైరల్ వీడియో..!!

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏబీ వెంకటేశ్వరరావు పేరు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌ ఆఫీసర్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు నీ తాజాగా జగన్ సర్కార్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే నిబంధనలకు విరుద్ధంగా  ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసి.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే కారణంతో పొరుగు దేశానికి మనదేశ పరికరాల సమాచారాన్ని రహస్యంగా ఇచ్చారని ఇది దేశ ద్రోహం అంటూ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

Image result for amanchi krishna mohan

ముఖ్యంగా చంద్రబాబు హయాంలో ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ పార్టీ నాయకులను మరియు లీడర్లను తీవ్రస్థాయిలో ఇబ్బందిపాలు చేయడం జరిగింది. అప్పట్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్న తరుణంలో ఒకపక్క ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పాదయాత్ర చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే మరోపక్క ఏబీ వెంకటేశ్వరరావు వైసిపి పార్టీ నాయకులను బలమైన క్యాండెట్ లను టార్గెట్ గా చేసుకుని తప్పుడు కేసుల్లో ఇరికించారు అని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ అప్పట్లో వైసిపి సీనియర్ నాయకులు గవర్నర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.

 

కాగా వీరందరి కంటే ముందే ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ముందునుండి ఏబీ వెంకటేశ్వరరావు పని తీరుపై రాష్ట్రంలో ఆయన వ్యవహరించిన తీరుపై మీడియా ముందే షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఏబీ వెంకటేశ్వరరావు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడటం జరిగింది. అంతేకాకుండా చీరాలలో కరణం బలరాం కనీసం ఎలక్షన్ ప్రచారం కూడా చేయలేదని దగ్గరుండి ఏబి వెంకటేశ్వరరావు..దారుణమైన కుయుక్తులు పన్ని వైసీపీ పార్టీకి చెందిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారని అప్పట్లో చెప్పడం జరిగింది. 

ఇది చాలా దారుణం అయినా పరిణామం అంటూ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా న్యాయంగా నిర్వహించాల్సింది పోయి దగ్గరుండి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి భయంకరమైన ప్లాన్ వేశారని ఎలక్షన్ ముందు ఆమంచి కృష్ణమోహన్ మీడియా సమక్షంలో చెప్పిన వీడియో ఇప్పుడు తాజాగా వైరల్ అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీ వెంకటేశ్వరరావు చేసిన కుయుక్తులు పనులు అన్నీ బయటపడటంతో ఆమంచి కృష్ణమోహన్ అందరికంటే ముందే ఏబీ వెంకటేశ్వరరావు గురించి హెచ్చరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వాట్సాప్ లో వైరల్ అవుతుంది. 

Read more RELATED
Recommended to you

Latest news