తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ పార్టీలు అయినా కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీ లకు దిమ్మతిరిగిపోయే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు కెసిఆర్ సాధించడంతో ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దలు కెసిఆర్ ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలకు బెంబేలెత్తుతున్నారు అని జాతీయ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి.
గతంలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి రెడీ అయిన కేసీఆర్ తర్వాత ఎన్నికల ముందు విరమించుకోవడం తో తాజాగా దేశంలో కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ నాయకులు దేశాన్ని విడదీసే విధంగా కొత్త కొత్త రూల్స్ బిల్లును తీసుకు వస్తున్న నేపథ్యంలో దేశ సమగ్రత మరియు ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు విరుద్ధంగా త్వరలోనే దేశంలో సరికొత్త సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు హైదరాబాద్ వేదికగా కేంద్రంపై తిరుగుబాటు చేసే విధంగా వ్యవహరించడానికి రెడీ అవ్వబోతున్నట్లు కెసిఆర్ పేర్కొన్నారు.
ఈ రాజకీయ ఎత్తుగడతో భవిష్యత్తులో కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందని ఈ విషయంలో జగన్ ని కూడా కలుపుకొని పోతే పాన్ ఇండియా పొలిటిషన్ తరహాలో జగన్ పేరు మారు మ్రోగుతున్న నేపథ్యంలో దేశంలోనే బెస్ట్ చీఫ్ మినిస్టర్ నాలుగవ స్థానంలో ఇటీవల జగన్ కి ర్యాంక్ రావడంతో జాతీయ స్థాయిలో కేసీఆర్ వేసే ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కి ఉపయోగపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.