దివ్యాంగుల విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం..!!

-

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడుగా వెళ్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు త్వరత్వరగా అడుగులు వేస్తున్నారు. ఇక తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్‌ దివ్యాంగులుకు మరింత ఆసరా ఇచ్చే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. గవర్నమెంట్ జాబ్స్, ప్రమోషన్స్‌లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం వారికి 3 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా, తాజాగా జగన్ సర్కార్ ఒక్క శాతం పెంచి మొత్తం నాలుగు శాతంగా ఖరారు చేసింది.

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అంధత్వం, చూపు మందగించడం వంటి సమస్యలు ఉన్నవారికి 1 శాతం, వినికిడి లోపం ఉన్నవారికి 1 శాతం, మస్తిష్క పక్షవాతం, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, చలన సంబంధ వైకల్యం, కండరాల బలహీనత, మరగుజ్జుతనం, యాసిడ్​ దాడి బాధితులకు 1 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. ఇక లెర్నింగ్​ డిసెబిలిటీ, ఆటిజం వంటి సమస్యలతో బాధపడేవారికి సైతం 1 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఏ ప్రభుత్వ శాఖలో అయినా 5గురికి మించి స్టాఫ్ ఉంటే..అక్కడ ప్రమోషన్స్‌లోనూ ఇదే తరహా రిజర్వేషన్లు అమలుకానున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news