క‌రోనా.. వేళ‌.. వైసీపీ ఎమ్మెల్యేల సామాజిక బాధ్య‌త‌.. ఏం చేస్తున్నారంటే…!

-

దేశాన్ని క‌రోనా క‌మ్ముతోంది. అందుకే లాక్‌డౌన్ పాటిస్తున్నాం.. ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ప్ర‌భుత్వాలు దం డోరా వేస్తున్నాయి. దీంతో యావ‌త్ దేశం కూడా అక్క‌డ‌క్క‌డా మిన‌హాయిస్తే.. అంతా బీరువాలో ఒదిగిపోయిన కొత్త చీర‌లా ముడుచుకుపోయింది. అయితే, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న‌క‌ల్పించేందుకు ఒక ప‌క్క ప్ర‌బుత్వాలు ప్ర యత్నిస్తున్నాయి. అధికారులు కూడా త‌మ‌దైన శైలిలో ముందుకు సాగుతున్నారు. మ‌రి వీటి వ‌ర‌కు స‌రిపో తుందా?  అంటే.. కాద‌ని, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో తాము కూడా ముందుంటామ‌ని చెబుతున్నా రు వైసీపీ నాయ‌కులు. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో ముందున్నారు.

నిన్న‌టికి నిన్న చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడి భాస్క‌ర‌రెడ్డి దాదాపు నాలుగు ల‌క్ష‌ల శానిటైజర్ల ను ప్ర‌జ‌ల‌కు పంచారు. వారిలో అవ‌గాహ‌న క‌ల్పించారు. అదేస‌మ‌యంలో తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రు ణాక‌ర‌రెడ్డి.. కూడా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు తాను రోడ్ల‌పైకి వ‌చ్చారు. క‌లెక్ట‌ర్‌తో క‌లిసి ఆయ‌న రోడ్ల‌పై తిరుగుతున్నారు. ఇంత విప‌త్క‌ర స‌మ‌యంలో ప్ర‌జ‌లకు అందాల్సిన నిత్యావ‌స‌రాల‌ను అందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఎవ‌రూ ఎక్క‌డా ధ‌ర‌లు పెంచ‌కుండా కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో యువ‌త రోడ్ల‌మీద‌కి రాకుండా జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు.

ఇక‌, అర‌కులోయ వైసీపీ ఎమ్మెల్యే జెట్టి ఫ‌ల్గుణ కూడా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. ముఖ్యంగా తండాల్లో ప‌ర్య‌టిస్తూ.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య సంరక్ష‌ణ‌పై జాగ్ర‌త్తలు నేర్పుతున్నారు. వారితో క‌లి సి తాను కూడా పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకుంటున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ధైర్యం చెబుతున్నారు. వారికి నిత్యావ‌స‌రాల‌ను అందుబాటులో ఉంచేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వైద్య స‌దుపాయాల‌ను అందుబాటులో ఉంచేలా కూడా వైద్యాధికారుల‌తో మాట్లాడారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ.. వారికి చేదోడు వాదోడుగా సేవ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news