అధికార దురహంకారం ఎక్కువ కాలం నిలవదు-ప్రియాంక గాంధీ

-

గుజరాత్‌ కోర్ట్‌లో రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. ఆయన వేసిన పునర్‌విచారణ పిటీషన్‌ను అక్కడి కోర్టు తిరస్కరించింది.ట్రయల్‌ కోర్ట్‌ తీర్పు సరైనదేనని చెప్తూ జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు దరఖాస్తును కోట్టివేస్తున్నట్లు పేర్కొంది.అయితే తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు.బీజేపీని,కేంద్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా టార్గెట్‌ చేశారు. అధికార దురహంకారం ఎక్కువకాలం నిలవదని పేర్కొన్నారు.నిజాన్ని బయటకు తీసుకురావడానికి రాహుల్ ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉన్నారని, అహంకారపూరిత బీజేపీ ప్రభుత్వం ఎన్ని దాడులు, వ్యూహాలు పన్నినా, నిజమైన దేశభక్తుడిలా రాహుల్‌ నిలుస్తారని ట్విట్టర్‌ ద్వారా సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొన్నారు.ప్ర‌జ‌ల రాహుల్‌ వెంట ఉన్నారని గుర్తు చేశారు.

ఇంకా ప్రియాక గాంధీ ఏమన్నారంటే-ప్రజా ప్రయోజన ప్రశ్నలు లేవనెత్తకూడదని అహంకార శక్తులు కోరుకుంటాయి.దేశ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు నియంత లాంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని అన్నారు. ద్రవ్యోల్బణంపై ప్రశ్నలు అడగకూడదనేలా అహంకార శక్తులు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.యువత,ఉపాధి, రైతుల సంక్షేమం కోసం గొంతు వినిపించకూడని ప్రభుత్వంలో మనం ఉన్నామని ఆవేదన చెందారు. మహిళల హక్కుల గురించి మాట్లాడకూడదని, కూలీల గౌరవం గురించి అసలు ప్రశ్నించకూడదని పేర్కొన్నారు.

అటు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌ పార్టీ తీరుపై మండిపడుతున్నారు.బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ పై విరుచుకుపడ్డారు.రాహుల్ గాంధీని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని కాంగ్రెస్ నేతలను రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. రాహుల్‌కి సరిగ్గా మాట్లాడటానికి ఎందుకు శిక్షణ ఇవ్వలేరని కాంగ్రెస్‌ను అడిగారు. ఈ విషయంలో రాహుల్‌ సారీ చెప్పి ఉంటే వ్యవహారం ముగిసిపోయేదని అన్నారు. ప్రముఖ నేతలు, సంస్థలపై దుర్భాషలాడడం, పరువు తీయడం, దాదాపు అత్యంత దారుణంగా దుర్భాషలాడడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని రవిశంకర్ అన్నారు.ఇలాంటి వ్యక్తి ప్రధాని అయితే దేశం నష్టపోతుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version