ప్రధాని మోడీ 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. దీంతో నిత్యావసర సరుకులు మరియు కూరగాయల దగ్గర డబ్బు ఉంది కదా అని ఎగబడి సరుకులు కొంటే ఖచ్చితంగా అదే మళ్లీ మన కొంప ముంచుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల ప్రస్తుతం దేశంలో ఐశ్వర్యవంతులు నుండి పేదవాళ్ల వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో డబ్బు ఉంది కదా అని కిరాణా షాపు వద్ద పరిమిత కాల సమయంలో కొన్ని నెలలపాటు సరుకులు తీసుకోవటానికి టైం వెచ్చిస్తే వెనక ఉన్న పేద వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుందని వాళ్ళ కోసం ఆలోచించి ప్రతి ఒక్కరు లాక్ డౌన్ ఈ సమయంలో వ్యవహరించాలని చాలామంది కోరుతున్నారు.
ఏ మాత్రం ఆకలి కేకలు పేదవాళ్ల లో ఎక్కువైతే సమాజంలో పరిస్థితి మొత్తం మారిపోతుందని అది మీ కొంప ముంచుతోంది అంటూ సోషల్ మీడియాలో కొంతమంది ప్రముఖులు సూచనలు ఇస్తున్నారు. కాబట్టి పేద వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కీలకమైన లాక్ డౌన్ సమయంలో డబ్బున్నవాళ్ళు దయనీయంగా ప్రవర్తించాలని కోరుతున్నారు.