జిల్లాల ‘జగడం’: బాబు నో రెస్పాన్స్….జగన్‌ ప్లాన్ సక్సెస్?

-

కావాలని తీసుకొచ్చారో లేక…ప్రజలకు మేలు కలగాలని చేశారో తెలియదు గాని..జగన్ ప్రభుత్వం సడన్‌గా జిల్లాల విభజనని తెరపైకి తీసుకొచ్చింది. దీని వాళ్ళ లాభం ఏంటి అనేది సరిగ్గా క్లారిటీ లేకపోయినా..ఇప్పుడు ఈ జిల్లాల విభజన వల్ల పెద్ద రచ్చ నడుస్తోంది. అసలు జన గణన పూర్తి కాకుండా జిల్లాల విభజన జరగదు….ఇప్పటికే దీనిపై కేంద్రం ఆదేశాలు ఉన్నాయి…మరి అలాంటప్పుడు జిల్లాల విభజన చేసి…లేని పోని తలనొప్పులని తీసుకొచ్చారు.

chandrababu naidu ys jagan13 జిల్లాలని కాస్త 26 జిల్లాలుగా చేశారు…అయితే దీని వల్ల కొందరు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు…కానీ కొందరు మాత్రం…తమకు ఈ జిల్లా వద్దని, మమ్మలని వేరే జిల్లాలో కలపాలని ఎక్కడకక్కడే డిమాండ్లు వస్తున్నాయి. ఆఖరికి సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా రచ్చ తారాస్థాయికి చేరుకుంది. కడప అని కాదు…దాదాపు అన్నీ జిల్లాల్లో ఏదొక రచ్చ నడుస్తూనే ఉంది.

అంటే ఈ రచ్చ జరుగుతుందని వైసీపీ ప్రభుత్వం ముందే ఊహించిందా? అసలు రాష్ట్రంలో ఉన్న సమస్యలని డైవర్ట్ చేయడానికి జిల్లాల విభజనని తెరపైకి తీసుకొచ్చారా? అనే అనుమానాలు వస్తున్నాయి. వాస్తవానికి అదే నిజమనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి…ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు..ఇవన్నీ పక్కకువెళ్ళి…కేవలం ప్రజలంతా జిల్లాల విభజన గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే సమస్యలు పక్కకు వెళ్లాలనే జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.

ఇక ఈ జిల్లాల విభజనపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించలేదు. కింది స్థాయిలో టీడీపీ నేతలు స్థానికంగా స్పందిస్తున్నారు తప్ప..రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే దీనిపై చంద్రబాబు ఆచి తూచి ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల విభజనపై ఆయన, తమ పార్టీ నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు సమాచారం..వీటిల్లో ఉన్న లోపాలని తెలుసుకుని అప్పుడు స్పందించాలని బాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ జిల్లాల జగడం కంటిన్యూ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news