ఆడపడుచులకు కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ కానుక ఇస్తుందా..? జరుగుతున్న చర్చ ఇదే

-

ఆశ్వయుజ మాసం వచ్చేస్తుందంటే.. బతుకమ్మ పండుగ కూడా వచ్చేసినట్లే. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఈ పండగ హడావుడి అంతా ఇంతాకాదు.. మహిళలకు సంబంధించిన పండుగ కావడంతో.. దీనికి ఎంతో విశిష్టత ఉంటుంది.. దసరాకు రెండు రోజుల ముందు వచ్చే ఈ పండుగను బతుకమ్మ పండుగ సద్దుల పండుగ అనే పేర్లతో పిలుస్తుంటారు.. గత ప్రభుత్వం ఈ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించింది..

బతుకమ్మ పండుగ కోసం మహిళలు ఎదురుచూస్తుంటారు.. దేశ విదేశాల్లో ఉండే బంధువులు కూడా ఈ పండుగ కోసం స్వంత ఊర్లుకు వస్తుంటారు.. తెలంగాణా రాష్టమంతా పండుగ సందడి మొదలైంది.. మరో నాలుగు రోజుల్లో సద్దుల బతుకమ్మను కూడా జరుపుకోబోతున్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చే కానుక కోసం మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళల కోసం చీరలు ఇచ్చేవారు..

బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పండుగకు పెద్ద ఎత్తున చీరలు పంపిణీ చేసేవారు.. ప్రతిమహిళకు చీరను అందించేవారు. ఆడబిడ్డకు బతుకమ్మ కానుక అంటూ గత చీరలను అందించింది. అయితే.. ఈసారి తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వచ్చే తొలి పండుగ కావడంతో.. ప్రభుత్వం తరపున మహిళా మంత్రులు పండుగలో పాల్గొంటున్నారు..కానీ తెలంగాణా ఆడపడుచులకు పండుగ కానుక ఏం ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది..

బిఆర్ఎస్ చీరలు పంపిణీ చేసే సమయంలో రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.. చీరల పథకంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని.. ఆరోపించారు..అధికారంలోకి రాగానే సమగ్ర దర్యాప్తు చేయిస్తామన్నారు.. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. చీరల పంపిణీ గురించి ఆలోచించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ప్రభుత్వం తరపున మహిళలకు నగదు అందిస్తామని ప్రచారం జరిగినా..అది ఇంత వరకు కార్యారూపం దాల్చలేదు.. దీంతో.. నగదు ఇస్తారా..ఇవ్వరా అనే చర్చ తెలంగాణా ఆడపడుచుల్లో జరుగుతోంది.. దీనిపై రేవంత్ సర్కార్ ఎలా ముందడుగు వేస్తుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version