జ‌గ‌న్ ఇంటిముందు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం…

830

బుద్దా వెంక‌న్న‌. టీడీపీలో ఫైర్ బ్రాండ్ అని అనిపించుకునేందుకు ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు. ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లో స‌త్తా ఎటూ చాటుకోలేని ఈయ‌న ప‌రోక్ష రాజ‌కీయాల్లో ఎట్ట‌కేల‌కు ఎమ్మెల్సీ స్థానాన్ని అందిపుచ్చుకున్నారు.దీంతో అప్ప‌టి నుంచి ఏదో ఒక విధంగా నిత్యం మీడియాలో ఉండేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటు ప్ర‌జ‌ల్లోనే బ‌లం లేద‌ని అనుకుంటే.. అటు పార్టీలోనూ ఆయ‌న‌ను ప‌ట్టించుకునే నాధుడు లేకుండా పోయారు.

TDP Leader Buddha Venkanna Sensational Comments on YS Jagan
TDP Leader Buddha Venkanna Sensational Comments on YS Jagan

ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.. ఇటీవ‌ల న‌లు గు పెట్టిమ‌రీ.. కుంకుడు కాయ ర‌సంతో త‌లంటేశాడు. అయినా కూడా బుద్దాలో మార్పు రాలేద‌ని అంటు న్నారు టీడీపీ త‌మ్ముళ్లే!
కొన్నాళ్ల కింద‌ట టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌యుడు మండ‌లికి పోటీ చేస్తాన‌ని అన్న‌ప్పుడు నేను ఎమ్మె ల్సీని త్యాగం చేస్తాను- అంటూ బుద్దా ఎలుగెత్తారు. అయితే, ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదనుకోండి. కానీ, ఎప్ప‌టిక‌ప్పుడు మీడియాలో క‌నిపించాల‌నే ఆతృత‌, ఆరాటం.. వంటివి బుద్దాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంటాయి.

అయితే, ఆయ‌న వాస్త‌వాల‌ను మ‌రుగు ప‌రుస్తారో.. తానే మ‌రిచిపోతారో అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. తాజాగా ఆయ‌న జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. చంద్రబాబును హతమార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ కుట్రలను ఇప్పటికైనా మానుకోకపోతే పాలకుల కుతంత్రాల గురించి ప్రపంచానికి తెలిసేలా ముఖ్య మంత్రి జగన్‌ ఇంటి ముందే తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. తమ అధినేతను కాపాడు కునేందుకు తాను చావడానికైనా సిద్ధమేనని చెప్పారు.

ఈ విష‌యంపైనే జ‌నాలు న‌వ్విపోతున్నారు. టీడీపీ నాయ‌కులు ప్ర‌జ‌ల దృష్టిలో ఎప్పుడో పోయార‌ని, ఇప్పుడు ప్ర‌త్యేకంగా పోవాల్సిన అవ‌స‌రం ఏముందని ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కుల‌ను ప్ర‌జ‌లు చిత్తుగా ఓడించిన‌ప్పుడే వారికి ఇక , నూక‌లు చెల్లాయ‌ని, ఇప్పుడు బుద్దా ప్ర‌త్యేకంగా ఆత్మ‌హ‌త్య‌కు ఉబ‌లాట‌ప‌డ‌డం ఎందుకు? అని వైసీపీ శ్రేణులు స‌హా ఓ వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి కూడా ప్ర‌తి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి వీటిపై బుద్దా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.